చెన్నూర్ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ.
December 27, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం భీమారం (10), చెన్నూరు (70), కోటపల్లి (4) మండలాలకు సంబంధించిన 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరియు 42 మంది లబ్ధిదారులకు 16,07,500/- లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అదేవిధంగా..... చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం (B1 క్వార్టర్) యందు మందమర్రి మున్సిపాలిటీ (37), మందమర్రి మండలం (12), రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ (29) మంది మొత్తంగా 78 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మరియు ఏడుగురి లబ్ధిదారులకు 3.44 లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మిి మరియు ప్రజాప్రతినిధులు, నాయకుల చేతి మీదిగా అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇతర బిఅర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.




