DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వైష్ణవి ఫంక్షన్ హాళ్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన బెల్లంపల్లి నియోజకవర్గస్థాయి BRS పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మన్నె క్రిశాంక్. ఈ సందర్భంగా అధ్యక్షులు, ముఖ్యఅతిథిలు మాట్లాడుతూ.... సోషల్ మీడియా సైనికులందరూ BRS పార్టీకి, ప్రజలకు మధ్య వారధుల లాంటివారని, BRS పార్టీ సోషల్ మీడియా సైనికులందరినీ తాము ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన, BRS పార్టీ ప్రజాప్రతినిధులపైన కక్షపూరిత దుష్ప్రచారాలు చేస్తున్న BJP, కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీల నిరాధారమైన ఆరోపణలను BRS పార్టీ సోషల్ మీడియా సైనికులమైన మనమందరం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని, అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకునివెళ్లి వారికి అర్థమయ్యేవిధంగా వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, మంచిర్యాల జిల్లా BRSV అధ్యక్షుడు శ్రావణ్, బెల్లంపల్లి నియోజకవర్గ BRSY అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు రవితేజ, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల మరియు పట్టణ BRSY, BRSV అధ్యక్షులు, సభ్యులు, సోషల్ మీడియా వారియర్స్, BRS నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


