DIGITAL MANCHERIAL NEWS:- ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని బెల్లంపల్లి పట్టణంలో వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ కాశీ సతీష్ కుమార్ పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడని తెలిపారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషులకు ఓటు హక్కు కల్పించి, స్త్రీ, పురుషులకు సమానమైన హక్కులు కల్పించారని, అలాగే ప్రపంచంలోనే అత్యధిక డిగ్రీ పట్టాలు పొందిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు జాగటి కల్పన, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాతరి కిరణ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఓరం కవిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేష్, మండల అధ్యక్షుడు ఆధార్ల మహేందర్, పట్టణ ఉపాధ్యక్షులు లింగంపల్లి సురేష్, రాకేష్, శశింద్ర, బోయిని కవిత తదితరులు పాల్గొన్నారు.


