DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని తాండూర్ మండలంలో పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని బుధవారం వాటర్ ట్యాంక్ కి నిరసన తెలిపిన బెల్లంపల్లి జోన్ కు చెందిన ఆరు మండలాల మిషన్ భగీరథ గ్రిడ్ కార్మికులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, చెల్లించని యెడల తమ సమ్మెను మరింత ఉదృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక సీఐ, ఎస్సై వచ్చి కార్మికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.


