మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని పెద్ద దుబ్బ గ్రామానికి చెందిన చింతకింది పోషం (30) అనే యువకుడు సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొద్ది రోజులుగా ఫుల్లుగా మద్యం సేవిస్తూ... ఏ పని చేయకుండా తిరుగుతూ, నిత్యం డబ్బుల కోసం భార్యను వేధిస్తుంటాడు. అయితే సోమవారం మద్యం తాగడానికని భార్యను డబ్బులు ఇవ్వమని అడగగా... భార్య డబ్బులు ఇవ్వనని చెప్పడంతో కోపంతో ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు దగ్గర్లోనే ఆసుపత్రికి తీసుక వెళ్లేసరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by