బిజెపి ఉపాధ్యక్షుడిగా బొమ్మెన హరీష్ గౌడ్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా బెల్లంపల్లి నియోకవర్గంలోని నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్ నియమితులయ్యాడు. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ.... బిజెపి పార్టీని మరింత బలోపితం చేయడానికి, బీజేపీ పార్టీ జెండాను గ్రామాల ప్రజల్లోకి తీసుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా ముందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే తన మీద నమ్మకముతో తనకు పదవి అప్పగించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పెద్దపల్లి మాజీ ఎంపి గడ్డం వివేక్ వెంకట స్వామి, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లీ రఘునాథ్, మంచిర్యాల బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రజినిష్, అందుగుల శ్రీనివాస్, మునిముంద రమేష్, ఇతర నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by