దత్తాత్రేయుని జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలో దత్తాత్రేయుని జన్మదిన సందర్భంగా బుధవారం  బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం పట్టణంలోని కాంటా, కాల్ టెక్స్, బజార్ ఏరియాలలో యాచకులకు, అనాధలకు అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి మాట్లాడుతూ... మన దగ్గర ఉన్న దానిని పదిమందికి పంచడంలో వచ్చే ఆనందమే వేరని, సేవ చేసే గుణం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్,కోశాధికారి జక్కం నాగమణి సభ్యులు, కొంక శ్రీనివాస్ సేవకులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by