DIGITAL MANCHERIAL NEWS:- జైపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో యూటర్న్ తిరిగే దగ్గర స్ట్రీట్ లైట్ లేక స్పీడ్ బ్రేకర్ లేక తరుచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని నేతకాని మహర్ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు సోమవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జైపూర్ ఎస్సీ కాలనీ మొదలుకొని సాగర్ రావు కాంప్లెక్స్ వరకు మెయిన్ రోడ్డుకు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతరలు పాల్గొన్నారు.

