గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గంజాయి దందా జోరుగా సాగుతుందని ప్రచారం జరుగుతుంది. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని స్థానిక వైశ్య భవన్ వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు అందిన పక్క సమాచారం మేరకు దాడి చేయగా అప్పారపు రఘువర్ధన్ అనే వ్యక్తి వద్ద  200 గ్రాముల గంజాయి దొరకడంతో  అతనిని అదుపులోకి తీసుకుని, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుగుణాకర్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో ఎస్సైతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by