అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం క్యాతనపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో అధికారులతో ఆయన స సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వర్షాకాలం లోపు పెండింగ్ పనులన్నీ పూర్తయ్యలా కార్యచరణ రూపొందించుకొని పనిచేయాలన్నారు. కొనసాగుతున్న పనులతో పాటు కొత్తగా నిర్మించాల్సిన వాటిపై అధికారులు జాబితా రూపొందించాలన్నారు. అలాగే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అటవీ అనుమతులు, కొత్తగా నిర్మించాల్సిన బ్రిడ్జిలు రోడ్లకు సంబంధించి త్వరలోనే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని  హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by