DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపేట మండలం పెద్ద ధర్మారం గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని, సర్పంచ్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని గ్రామ యువకులు గురువారం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గ్రామంలో కనీస త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, అలానే సింగరేణి ప్రభావిత ప్రాంతం కావడంతో కనీసం సింగరేణి జిఎం అయినా స్పందించి... గ్రామానికి అంతర్గత రహదారులు, యువతకు ఆట స్థలం కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని యువకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

