DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 గురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అవడం తమని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేసి. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి,ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని, విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
.

.jpeg)