కలెక్టరేట్ ఎదుట యువకుడు పెట్రోల్ తో ఆత్మహత్య ప్రయత్నం...!
December 05, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం రొయ్యలపల్లి కి చెందిన కుమ్మరి సంతోష్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం. వివరాలు ఇలా ఉన్నాయి... రొయ్యలపల్లి గ్రామానికి చెందిన మరి సంతోష్ అనే వ్యక్తి సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కోటపల్లి ఎంపీడీవో కాంప్లెక్స్ లో గత పది సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటుండగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎంపీపీ మంత్రి బాపు కావలసికొని, ఎంపీడీవో సహాయంతో తన దుకాణానికి తాళం వేసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.




