DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో తాగిన మైకంలో తన ఇల్లు అనుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి, వారు కొట్టిన దెబ్బలకు వ్యక్తి మృతి. వివరాల్లోకి వెళితే.... దేవపూర్ గ్రామానికి చెందిన మంతెన మురళి అనే వ్యక్తి కొండాపూర్ యాప గ్రామంలో ఫుల్లుగా మద్యం సేవించి... కాలినడకన దేవపూర్ కు వెళుతున్న క్రమంలో గ్రామ శివారులో ఉన్న గోపతి భూమయ్య ఇంటిలోకి వెళ్లడంతో అర్ధరాత్రి సమయంలో ఎవరు ఆదార్థుడు తమ ఇంట్లోకి వచ్చాడని అతనిపై కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స కోసం మంచిర్యాల లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవపూర్ ఎస్సై విజయేందర్ భూమయ్య పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామన్నారు.

