దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ...!
December 03, 2022
0
DIGITAL MANCHERIAL NEWS:- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లపూడి కృష్ణ స్వరూపం నేతృత్వంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పార్నంది రమేష్ చంద్ర ఆధ్వర్యంలో గల పెద్దపల్లి, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలలో జెండా నిర్మాణ మరియు ఆవిష్కరణ కార్యక్రమాన్ని డిసెంబర్ 27 నుంచి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో దళిత బహుజన పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అలాగే మండల, గ్రామస్థాయిలలో కమిటీలను వేసి దళిత బహుజన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్నంది రమేష్ చంద్ర పిలుపునిచ్చారు.

