DIGITAL MANCHERIAL NEWS:- చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ విద్యార్థిని దుర్గం సంధ్యారాణి కి బిఎస్సీ నర్సింగ్ లో సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్థోమత లేక కాలేజీలో అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న చెన్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జుల్ఫీకర్ అహ్మద్, సిర్సా సర్పంచ్ పెద్దింటి పున్నం చంద్, అలుగామ ఎంపీటీసీ గోమాస రజిత ప్రవీణ్ ద్వారా రూ. 30 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భవిష్యత్ లో కూడా అండగా ఉంటానని ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు కొండగుర్ల రామయ్య, రైతు కో ఆర్డినేటర్ జెట్టి రాంచందర్, మాజీ సర్పంచ్ మారిశెట్టి వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు.

