కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణ చేయనని చెప్పిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు సింగరేణిని ప్రవేటికరణ చేసే కుట్ర చేస్తుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలాన్ని నిరరిస్తూ మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం ఆందోళన నిర్వహించి... కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూటకో మాట మాట్లాడుతున్నాడని, తెలంగాణ రాష్ట్రంలో రామగుండం కి వచ్చినప్పుడు ప్రైవేటీకరణ చేయనని చెప్పిన మోడీ మాట మరువకముందే బొగ్గు బ్లాక్ ల వేలం చేస్తున్నారని, రానున్న రోజులలో మోడీ ప్రభుత్వానికి కష్టకాలం తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికెల సంపత్ కుమార్, సెంట్రల్ కమిటీ సభ్యులు మిట్ట సూర్యనారాయణ, సీహెచ్ రమణ, జీఎం కమిటీ సభ్యులు డీ.శంకర్రావు, కే. లక్ష్మణ్, ఏరియా సెక్రటరీ ఎం. ఈశ్వర్, పిట్ సెక్రటరీలు కొండల్రావు, గాలిపెల్లి తిరుపతి ఇతరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by