DIGITAL MANCHERIAL NEWS:- 31 వేడుకల్లో బీరు తాగిన కోతి బీరు లాగించేసింది. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎసిసి క్వారీలో శనివారం రోజు కొంతమంది యువకులు 31 వేడుకలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి కొన్ని కోతులు రావడంతో యువకులు పరుగులు పెట్టారు. అక్కడే వదిలేసిన ఓ బీర్ గ్లాసును కోతి లాక్కెల్లి మరీ ఎంచక్కా తాగేసింది. కోతి బీరు తాగడంతో యువకులంతా ఆశ్చర్యపోయి, 31 ప్రోగ్రాంలో కోతి తాగిన బీర్ అంటూ నినాదాలు చేశారు.



