DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణం 23వ వార్డ్ లో (స్టేషన్ రోడ్ కాలనీ ) 1 కోటి 20 లక్షల రూపాయల సింగరేణి నిధులతో చేపడుతున్న BT మరియు CC రోడ్ల రెన్యూవల్ పనులను ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమని, కొందరు కావలసికొని అభివృద్ధిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా సింగరేణి GM చింతల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, TBGKS సెంట్రల్ కమిటీ సభ్యుడు రాయలింగు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణ BRS అధ్యక్షుడు నారాయణ, BRS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


