పురుగుల మందు తాగి యువకుడు మృతి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- లక్షెట్టిపేట మండలంలో లక్ష్మీపూర్ కు చెందిన సురమల్ల సురేష్ (24) యువకుడు గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం సాయంత్రం ఎస్సై ఎస్ లక్ష్మణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మృతుని భార్య గత 14నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుండి తీవ్ర మనస్థాపం చెంది దిగులుగా ఉండేవాడన్నారు . ఇంట్లో కుటుంబ సభ్యులకు అప్పుడప్పుడు తన భార్య చనిపోయిందని తాను కూడా చనిపోతానని అంటూ ఉంటే కుటుంబీకులు నచ్చజెప్పి ఓదార్చే వారని తెలిపారు. ఈనెల 29న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రి 10 గంటలకు ఇంటి వెనుకాలకు వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఇంట్లోకి రావడంతో వాసన గమనించిన తన తమ్ముడు వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పి కారులో లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా రాత్రి 11.30గంటలకు మార్గ మధ్యలో చనిపోయాడు అన్నారు. మృతుడి తండ్రి యేసుదాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by