పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి:AISB.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చెయ్యాలి అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా కార్యదర్శి అల్లి సాగర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అఖిలభారత విద్యార్థి బ్లాక్(AISB) మంచిర్యాల  జిల్లా కార్యదర్శి అల్లిసాగర్ బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు... తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులపై సవితి తల్లి ప్రేమచూపిస్తుందని, సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతున్నారే తప్ప విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచడం లేదని, పక్క భవనాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ ముట్టడి చేపడుతామని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని, AISB ఆధ్వర్యంలో అసెంబ్లీ ముందు ఆమరణ నిరాహారదీక్షను చేపడుతామని అన్నారు. ఈకార్యక్రమంలో AISB  నాయకులు వెంకటేష్, బియ్యాల ప్రశాంత్, మనోహర్, రాకేష్, అవినాష్, తదితరులు పాల్గొన్నారు. 





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by