వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...  పాత మంచిర్యాలకు చెందిన బోయిని పావని, కుమార్ భార్య భర్తలు కాగా, ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న కుమార్ రోజు ఫుల్లుగా తాగొచ్చి వేధిస్తుండడంతో బాధను భరించలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఒక కుమారుడు కూతురు ఉండగా, మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్సై అంజయ్య తెలిపారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by