DIGITAL MANCHERIAL NEWS:- 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ అన్నారు. ఈ సందర్భంగా... శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాలో పేరు, చిరునామా మార్పులు, మరణించిన వారి వివరాలు తొలగింపు, ఇతరత్రా సవరణల కొరకు సంబంధిత ఫారముల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతీ హోలికెరీ, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామల దేవి, తదితరులు పాల్గొన్నారు.

