షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర విరామం తర్వాత 4 వ తేదీ నుండి పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొని పాదయాత్రను మంచిర్యాల జిల్లా వైయస్సార్ టిపి కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ... ప్రజల సంక్షేమమే, అభివృద్ధి ధ్యేయంగా  ముందుకు సాగుతున్న పాదయాత్రను నర్సంపేట ఎమ్మెల్యే అనుచరులు వాహనాలకు నిప్పు అంటించి కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది, దీనిని  మంచిర్యాల నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల తరఫున ఖండిస్తూ, రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగుతున్న పాదయాత్రను విజయవంతం చేస్తామని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ సల్మాన్,  జిల్లా ప్రచారకమిటీ అధ్యక్షులు పెండెం శ్రీలత, మైనారిటీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హది, జిల్లా కార్యదర్శి సంతోష్, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు ఎండి సమీర్, దండేపల్లి మండల్ యూత్ అధ్యక్షుడు కోళ్ల రాకేష్, నస్పూర్ మండల్ ప్రసిడెంట్ వేముల శ్యాం, నస్పూర్ మండల ప్రధాన కార్యదర్శ కోలుగురి వినయ్, నస్పూర్ పట్టాన కార్యదర్శి చంద్రగిరి మహేష్ ,నస్పూర్ పట్టాన ఉపాధ్యక్షుడు వడ్లూరి కుమార్, వెంకటస్వామి, హాజిపాషా పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by