DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అందుగుల పేట గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు అక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా... అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుని వివరాలు చూసుకుంటే మందమర్రి మండలంలో మేడారంకు చెందిన కుదిరే హనుమంతుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.



