విద్యారంగ సమస్యలపై చలో హైదరాబాద్: PDSU.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా కేంద్రం లోని  మార్క్స్ భవన్ లో డిసెంబర్ 22 న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బిగ్ డెబిట్ జయప్రదం చేయాలని సోమవారం PDSU ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని గత రెండు సంవత్సరాల నుండి 3500 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్ విడుదల చేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే విద్యార్థులు పై చదువులు చదవడం కోసం కళాశాలలకు వెళ్లి సర్టిఫికెట్లు ఇవ్వమంటే స్కాలర్షిప్లు రాక ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తానని యజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తూ. విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారు. కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ విద్య తీసుకురావడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే పరిస్థితి నెట్ట బడుతుంది. కాబట్టి ఈ రెండు అంశాలపై డిసెంబర్ 22న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర బిగ్ డెబిట్ ను విద్యార్థులు, యువకులు, వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, సిద్ధార్థ, పట్టణ కార్యదర్శి రాహుల్, నాయకులు వంశీ, కార్తీక్, శ్రీను పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by