DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలానికి చెందిన సంకురి రాజకుమార్ ఆధ్వర్యంలో యువకులు బెల్లంపల్లి పట్టణంలోని అమ్మానాదశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసే, పిల్లలకు పండ్లు, పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నూతన సంవత్సర వేడుకలను ఇలా పిల్లలతో జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం పిల్లలకు మధ్యాహ్నం భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యాప మహంకాళి మామిడి గూడెం సాయి కృష్ణ, వారిపేటకు చెందిన ప్రవీణ్, సిద్దు పాల్గొన్నారు.

