DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... కాల్ టెక్స్ దగ్గర రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వ్యక్తిని తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో రెండు కాళ్లు తెగిపోయి, నుజ్జు నుజ్జుగా మారాయి. కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని చికిత్స కోసం మంచిర్యాలలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.



