పేదల ఆకలిని అక్షరబంధం చేసిన కవి అలిశెట్టి ప్రభాకర్: ప్రిన్సిపాల్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  పేదల ఆకలిని అక్షరబంధం చేసిన సృజనాత్మక కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ చరస్మరణీయుడని బెల్లంపల్లి సి ఓ ఈ పాఠశాల ప్రిన్సిపల్ ఐనాల సైదులు అన్నారు. ఈ సందర్భంగా  గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ లో లాంగ్వేజ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఐనాల సైదులు మాట్లాడుతూ... తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పీడన, హింస తీవ్రంగా ఉన్న భూస్వామ్య గ్రామాల్లోని దయనీయమైన పరిస్థితులను, పేదల ఆకలిని అక్షరబద్ధం చేసిన గొప్ప స్రుజనశీలి యువకవి అలిశెట్టి ప్రభాకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో లాంగ్వేజ్ క్లబ్ అధ్యక్షులు కోట రాజకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by