నిజం న్యూస్ క్యాలెండర్ల ఆవిష్కరణ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ఉమ్మడి అదిలాబాద్ నిజం న్యూస్ దినపత్రిక జిల్లా బ్యూరో సిహెచ్. నరసయ్య సలహా మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాసరావు, లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నేరెళ్ల రాజేశ్వర్, మరియు లక్షెట్టిపేట ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ చేతుల మీదుగా నిజాం న్యూస్ దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ అధ్యక్షులు షాహిద్ అలీ మాట్లాడుతూ... జర్నలిస్టులు ఎల్లప్పుడూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అలాగేేే జర్నలిస్ట్ వృత్తికి వన్నె తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు ఎస్.కె అహ్మద్, సయ్యద్ హాది, ఎస్.కె మోబిన్, బిరుదుల ప్రవీణ్ కుమార్, ఖదీర్ ఖాన్, మహమ్మద్ సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by