DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 160 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువజన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాసిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ముత్యంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రపంచ యువతకు స్వామి వివేకానంద ఒక ఆదర్శమూర్తిగా కీర్తి పొందారని, అతి చిన్న వయసులోనే వివేకానంద దేశ విదేశాల్లో యువజన సదస్సులో ప్రపంచ పేరు ప్రఖ్యాతలు సంపాదించి, దేశ యువత కు ధైర్యం నూరి పోసి ప్రశ్నించే విధానం నేర్పిన స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడవాలని, యువత వారి గ్రామానికి పట్టణానికి మండలానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి సేవ చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాలని కాసిపేట మండల శాఖ తరపున యువతకు విజ్ఞప్తి చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఇన్చార్జ్ అక్కపురం రమేష్, బీజెపి మండల ప్రధాన కార్యదర్శి సురం సంపత్ కుమార్ బిజెపి మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్, పొలవేణి పోషన్న, ముత్యం పెళ్లి బూత్ అధ్యక్షులు సురేష్ , ముత్యం పెళ్లి బూత్ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

