వంద పడకల ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇటీవల ప్రారంభమైన  100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళీకెరీ. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారితో మాట్లాడుతూ... వైద్యులు నిత్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, ఇతర ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి, వైద్యులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by