బెల్లంపల్లి సీఓఈ విద్యార్ధికి ఆర్టికల్చర్ లో సీట్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ) విద్యార్ధి సెండే విఘ్నేష్ కాలేజి ఆఫ్ ఆర్టికల్చర్,మోజర్ల (వనపర్తి)లో బిఎస్సీ(హానర్స్) ఆర్టికల్చర్ లో సీటు సాధిచినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను అడ్మీషన్స్ కోసం ప్రొఫెసర్ జయషంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనీవర్సిటీ నిర్వహించ్నిన ఎంసెట్ కౌన్సిలింగ్ లో విఘ్నేష్ కు సీటు లభించిందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... విఘ్నేష్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పోన్ ద్వారా అభినందించారని, అదేవిధంగా అర్సీఓ కొప్పుల స్వరూపరాణి అభినందించారని తెలిపారు.   ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఐనాల సైదులు మాట్లాడుతూ... ప్రభుత్వంతోపాటు దాతలు మరింత సహకరిస్తే మరిన్ని అద్భుతాలు వచ్చేలా పిల్లలను ప్రోత్సహిస్తామని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు నలుగురు విద్యార్ధులు మా సిఓఈ నుండి ఉన్నత చదువులకు సీటు సాధించినప్పటి ఆర్ధిక పరిస్థితుల వల్ల ఫీజులు కట్టలేక ఐటి, ఎనైటి వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో జాయిన్ కాలేదు. మరో ఇద్దరు మద్యలోనే వచ్చి సాధారణ డిగ్రీ చదువుతున్నారు. 





  

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by