కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలంలోని కె కె 2 ఓపెన్ కాస్ట్ లో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆర్ వి ఆర్ కాంట్రాక్ట కు తగిన గుణపాఠం చెబుతామని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికుల జీవితాల నుండి సుమారు 1000 నుండి 2000 రూపాయలు కోతలు విధిస్తూ ఆర్ వి ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ పోగల్ రెడ్డి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ, సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అలాగే కార్మికులకు పని భారం పెంచారని, తక్షణమే ఆర్వీఆర్ మేనేజర్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్, బిజెపి నాయకులు B.సురేష్, రమేష్ కార్మికులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by