సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:-  నేటి సమాజంలో రోజురోజుకీ సైబర్ నేరస్థులు చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుంటూ అనేక నేరాలకు పాల్పడుతున్నారని అట్లాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని తాళ్ల గురజాల ఎస్సై రాజశేఖర్ సూచించారు. బుధవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి లో ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.... విద్యార్థులు చెడు స్నేహాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, సైబర్ నేరాల్లో ఎక్కువగా యువతే ఉండడం ఆందోళనకర విషయంగా మారిందని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన సమాజం చిత్కరించుకునే పలు రకాల చెడు పనులకు దగ్గరవడం వల్ల విద్ద్యార్థులు విలువైన జీవితాలను నష్టపోతారనిఅన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అమాయకులను టార్గెట్ చేస్తూ కొందరు దుర్మార్గులు చేస్తున్న క్రైమ్ పెరుగుతుందని అట్లాంటి వారిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. అలాగే...విద్యార్థులు ఉపాధ్యాయుల నుండి కొత్త విషయాలతో పాటు మంచి చెడులను తెలుసుకుంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వైస్ ప్రిన్సిపల్ దాసం అజిత, ఉపాధ్యాయులు కొక్కుల రాజేశ్వర్, కోట్రంగి గణపతి వామన్ సంతోష్ తిరుపతి, మల్లేష్ ,సుమిందర్ ,తేజ తదితరులు పాల్గొన్నారు.







Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by