DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామపంచాయతీ సర్పంచ్ జిల్లెపల్లి స్వరూప వెంకటస్వామి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామపంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులుగా నిర్వహించడం జరుగుతుందని, ఈ టోర్నమెంట్లో ఐదు జట్లు కన్నాల జట్టు, లక్ష్మీపూర్ జట్టు, ఎస్సీ కాలనీ జట్టు, తిరుమల హిల్స్ జట్టు, జిపి ఆఫీస్ ఏరియా జట్టు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ విజేతగా కన్నాల జట్టు రన్నర్ గ లక్ష్మీపూర్ జట్టు ఎంపిక గెలుపొందిందని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు సర్పంచ్ జిల్లపల్లి స్వరూప వెంకటస్వామి, ఉప సర్పంచ్ గుండారపు చంద్రమౌళి ఆధ్వర్యంలో బహుమతులను ప్రధానం చేయడం జరిగినది.


