ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మంగళవారం మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలకు, రోగులకు, సాయి భోజన్ అన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దాతలు బుద్దె రాజు, కరిష్మ గార్ల సహకారం తో ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. అలాగే ప్రతి మంగళవారం సాయి భోజన్ అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, గర్భిణీలు, బాలింతలు, రోగులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకులు మాట్లాడుతూ... అన్నదానంతో తృప్తిపరుద్దాం ట్రస్ట్ ద్వారా "ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం" అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి సభ్యులు కొంక శ్రీనివాస్, డి.మధుకర్ సేవకులు ఇగురపు భాస్కర్, ఏనుగు హేమలత, డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది ఎనగందుల దత్తు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by