సిఓఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ)లలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ అడ్మీషన్స్ కై  నిర్వహించే ప్రవేశపరీక్షకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాలా సైదులు తెలిపారు. ఈ సందర్భంగా సిఓఈ పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.... సంక్షేమ గురుకులాల సంస్థ  సిఓఈ సెట్-2023కి సంబందించిన నోటిఫికేషన్ విడుదలచేసిందన్నారు. అలాగే జనవరి 12 నుండి 31 వరకు ఆన్ లైన్ లో  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 5వ తారీకు (ఆదివారం) ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలు సంస్థ వెబ్ సైట్స్ https://www.tswreis.ac.in/ https://tsswreisjc.cgg.gov.in లను చూడవచ్చునన్నారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by