అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- నియోజకవర్గంలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ లోని 31వ వార్డు లో 3 లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలోని అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో బెల్లంపల్లి మొదటి స్థానంలో ఉందని అలానే రానున్న రోజులలో మరింత అభివృద్ధికి తోడు పడతామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, 31వ వార్డ్ కౌన్సిలర్ గెల్లి రాయలింగు మరియు ఇతర కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by