DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలోని జింకల పార్కు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే... జన్నారం మండల కేంద్రంలోని జింకల పార్కు దగ్గర జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోర్లు పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా... మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని చూసిన స్థానికులు చెప్పారు. ప్రమాదమునకు గల సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమునకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



