ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓటు అనేది ఓటర్ల ఆయుధమని, దానిని ప్రతి ఓటరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కు లేని 18 సంవత్సరాలు నిండిన వారు వెంటనే అప్లై చేసుకోవాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, సర్పంచ్లు రాయమల్లు, రంజిత-వెంకటేశ్ గౌడ్, అశోక్, అశోక్ గౌడ్, ప్రమీల గౌడ్, వెంకటేష్, రాజమోగిలి, ఎంపీటీసీలు శకుంతల-వెంకటేష్, సుభాష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, సత్యనారాయణ, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు భీమాగౌడ్, మల్లేష్, వెంకటేష్, శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేందర్, ఎంపీఓ శ్రీనివాస్, వైద్యాధికారి అనీష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by