అధికారుల నిర్లక్ష్యంతో... వాహనదారులకు తప్పని తిప్పలు...?

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పలువురి అధికారుల నిర్లక్ష్యంతో  సామాన్య వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. వివరాల్లోకి వెళితే వాహనం ఒకరిది... ఫైన్ మరొకరికి వేసిన సంఘటన చోటుచేసుకుంది. కాసిపేట మండలానికి చెందిన సామాన్యమైన ట్రాలీ డ్రైవర్ కు ఇనోవకు వేయవలసిన ఫైన్ వేశారు. దీనితో కంగుదిన్న ట్రాలీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. TS19TA5676 నెంబర్ గల ఇన్నోవా వాహనానికి వెయ్యవలసిన ఫైన్ ను   TS19T5676 నెంబర్ గల ట్రాలికి వేశారు. దీనితో ట్రాలీ డ్రైవర్ ఆవేదన చెందుతూ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజల పైన చలాన్లు వేయడం సరికాదని, అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు. 








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by