కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు గురువారం తాళ్లగురిజాల గ్రామపంచాయతీలో కంటివెలుగు కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కే.చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల కంటి పరీక్షల కోసం కంటివెలుగు అనే కార్యక్రమాన్ని అమలుచేసి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నారని, పేదప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రివర్యులు ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేదప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రంజిత-వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ శకుంతల-వెంకటేష్, వార్డుసభ్యులు, లంబడితండా సర్పంచ్ రాయమల్లు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీఓ రాజేందర్, ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మీ, కార్తిక్, తాళ్లగురిజాల ఎస్ఐ రాజశేఖర్, ఏఎస్ఐ రాజన్న, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిల, ఆప్టోమెట్రిస్ట్ పరమేశ్వరి, సూపర్ వైజర్ సమ్మయ్య, ఏఎన్ఎం లు ఉమారాణి, చంద్రకళ, పద్మ, ఆశాకార్యకర్తలు సుగుణ, యశోద, రాజేశ్వరి, లక్ష్మీ, డీఈవో స్వర్ణలత, ఇతర అధికారులు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.








Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by