జిల్లాలో క్షుద్రపూజల కలకలం...!

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... జైపూర్ మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో అల్లూరి నక్క రామయ్య దంపతుల ఇంటి ముందు రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు లేచే వరకు ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇంటి ఎదుట కుంకుమ పసుపుతో క్షుద్రపూజలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎవరో కావాల్సికొనే దుండగులు ఇలా చేస్తున్నారని, ఇలాంటి వారిని వెంటనే పట్టుకుని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇలా క్షుద్ర పూజలు చేయడంతో గ్రామ ప్రజలందరూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by