ఈ శ్రమ్ కార్డులపై అవగాహన సదస్సు.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- కేంద్ర ప్రభుత్వం శ్రామికుల కోసం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకాన్ని కార్మికులు అందరూ సద్వినియోగంచేసుకోవాలని బెల్లంపల్లి ఏ.ఎల్.ఓ సుకన్య కార్మికులకు సూచించారు. శుక్రవారం వారు తమ సర్కిల్ బెల్లంపల్లి పరిధిలోని కాసిపేట మండల కేంద్రంలో కర్మాగారాలను సందర్శించి కార్మికులకు ఈ శ్రమ పథకం యొక్క ప్రయోజనాలు మరియు అప్లై చేసుకొనే విధానాన్ని వివరించారు. ఈ శ్రమ పథకంలో చేరిన ప్రతీ కార్మికునికి ప్రమాద వశాత్తూ మరణిస్తే 2 లక్షలు, అంగ వైకల్యం కలిగితే భీమా లభిస్తుంది అని తెలిపారు. అసంఘటిత కార్మికులు అనగా వ్యవసాయ అనుబంధ రంగాల లో పనిచేసే ఎవరైనా ఈ పథకానికి అర్హులేనని తెలిపారు. స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ లు, ఇటుక బట్టీలలో కార్మికులను కలిసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. అనంతరం కాసిపేట మండల కేంద్రంలోని శివ ఇంటర్నెట్, కామన్ సర్వీస్ సెంటర్ వద్ద కార్మికులకు ఈశ్రామ్ కార్డ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎల్.ఓ పి.సుకన్య, ఉప్పులేటి మధునయ్య, కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడు రమటెంకి శివ, స్థానిక కార్మికులు పాల్గొన్నారు.






Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by