సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ.

D Prashanth Netha
0

DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు శుక్రవారం బూదాకూర్ద్ గ్రామపంచాయతీ ఇందిరానగర్ లో ఆరు లక్షల 70 వేల రూపాయల మండల పరిషత్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాణి-సురేష్, స్థానిక సర్పంచ్ కృష్ణమూర్తి, వార్డుసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు, BRS మండల నాయకుడు మల్లేష్, ఇతర నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by