DIGITAL MANCHERIAL NEWS:- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన డిగ్రీ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు కేయు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ నలంద కళాశాలలో 6గురు, అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ కళాశాలలో ముగ్గురు, ఆదిలాబాద్ విద్యార్థి కళాశాలలో ఇద్దరు, ఆదిలాబాద్ సైన్స్ కళాశాలలో ఇద్దరు, నిర్మల్ చాణక్య కళాశాలలో ఒక్కరు కాగజ్ నగర్ వివేకానందలో ఒక్కరు చొప్పున డిబార్ అయ్యారు. రోజువారిగా విద్యార్థులను డిబార్ చేసినప్పటికీ మిగతా విద్యార్థులలో ఎటువంటి మార్పులు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.

