DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భీమారం మండలంలోని ఎల్కెశ్వరం గ్రామపంచాయతీని ODF PLUS MODEL VILLAGE గా స్వచ్ భారత్ మిషన్ (గ్రామీణ్)గా ఎంపిక చేసింది. స్వచ్ భారత్ మిషన్ (గ్రామీణ్) సెంట్రల్ టీమ్ 2022 జూన్ లో ఎల్కెశ్వరం గ్రామానికి సందర్శించి గ్రామంలో ఇంటింటికి ఉన్న మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవడం, వర్మి కంపోస్ట్ ఏర్పాటు చేయడం, ద్వారా ఎరువు తయారు చేయడం, ప్లాస్టిక్ ను నిషేదించడం మరియు గ్రామస్థులకు పరిశుభ్రతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఎల్కెశ్వరం గ్రామంను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా గుర్తిస్తూ ODF PLUS MODEL VILLAGE గా స్వచ్ భారత్ మిషన్ (గ్రామీణ్ ) సెంట్రల్ వారు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సర్పంచ్, కార్యదర్శిని సన్మానించారు.

