DIGITAL MANCHERIAL NEWS:- జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణిని వేదింపులకు శాసనసభ్యులు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలనీ పద్మశాలి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బోగా శ్రావణి కి తమ సంఘ పూర్తి మద్దతుగా ఉంటుందని, ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పి... రాజీనామా చేసిన బోగా శ్రవణి ని తిరిగి చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పద్మశాలి నాయకులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర ఎమ్మెల్యే మారిచిపొవద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో బీసీలు పోషించిన ప్రధాన పాత్ర ను బిఆరెస్ నాయకులు గుర్తుకు పెట్టి కొని, సామాజిక న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు స్పందించి జగిత్యాల విషయం పై వెంటనే స్పందించలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో... పద్మశాలి బెల్లంపల్లి సొసైటీ కార్యదర్శి వొడ్నాల రాజేశం, పద్మశాలి సొసైటీ యువజన సొసైటీ కార్యదర్శి Aman రాజీవ్, ఇతరులు పాల్గొన్నారు.

