DIGITAL MANCHERIAL NEWS:- భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయిని సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో సాయి భోజన్ నిర్వహించారు. సింగరేణి ఏరియా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలకు సాయి భోజన్ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి మాట్లాడుతూ...మహిళలు చదువుకోలేని రోజుల నుంచి మహిళలంతా చదువుకోవాలనే వైపు గా మరల్చిన గొప్ప ఉపాధ్యాయిని సావిత్రి బాయి ఫూలే అని, అలాగే భర్త జ్యోతిబాఫూలేతో కలిసి పాఠశాలలు ప్రారంభించి విద్యా ఉద్యమం నడిపించారని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, కోశాధికారి జక్కం నాగమణి, సభ్యులు కొంక శ్రీనివాస్, సేవకులు ఇగురపు భాస్కర్,జక్కం శివరామ్, ఏనుగు హేమలత, వొద్నలా సత్యవతి, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది పాల్గొన్నారు.


